Updated : 19 Mar 2022 10:58 IST

Debt: రికవరీ కోసం వెళ్లినవారే.. రుణం తీర్చారు

కేరళలో బ్యాంకు ఉద్యోగుల ఉదారత

లోన్‌ రికవరీ కోసం ఇంటిని జప్తు చేసేందుకు వచ్చిన బ్యాంకు సిబ్బంది.. రుణం తీసుకున్న వారి పరిస్థితి చూసి చలించిపోయారు. ఇంటిని జప్తు చేయడానికి బదులుగా సొంత ఖర్చుతో ఆ ఇంటిని పునర్నిర్మించారు. రుణాన్ని కూడా వీరే చెల్లించి ఉదారత చాటారు. కేరళలోని కోజికోడ్‌ జిల్లా కప్పాడ్‌కు చెందిన శశి.. తన తల్లి సరోజినితో కలిసి చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం బ్యాగుల తయారీ పరిశ్రమ పెట్టుకునేందుకు స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.50 వేలు అప్పు తీసుకున్నాడు. కొన్నిరోజులకు శశి పక్షవాతానికి గురికాగా.. అప్పు తీర్చలేకపోయాడు. బకాయిలతో కలిపి అప్పు మొత్తం రూ.70 వేలు అయింది. సమయానికి వడ్డీ, అసలు చెల్లించకపోవడంతో శశి ఇంటిని జప్తు చేసేందుకు బ్యాంకు మేనేజర్‌ ఎం.మురహరి సిద్ధమయ్యారు.

తన సిబ్బందితో కలిసి ఓరోజు ఆ ఇంటికెళ్లారు. అక్కడ శశి నిస్సహాయ పరిస్థితి, ఆ ఇంటిని చూసి చలించిపోయారు. ఏ క్షణంలోనైనా కూలిపోయే ఇంట్లో తల్లీ కొడుకులు ఉంటున్నారు. మరుగుదొడ్డి కూడా లేదు. శశి ఇంటిని వారే పునర్నిర్మించాలని సంకల్పించారు. తొమ్మిది మంది బ్యాంకు ఉద్యోగులు తమ సొంత నగదుతో ఇంటిని బాగు చేయించారు. బ్యాంక్‌ అదాలత్‌లో వన్‌-టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద బకాయిలు రూ.70 వేలు చెల్లించారు. బ్యాంకులో పని ముగించుకుని ఉద్యోగులే స్వయంగా ఆ ఇంటికి కావాల్సిన రాళ్లు, ఇసుక, సిమెంట్‌ను తీసుకొచ్చేవారు.  

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని