Updated : 19 Mar 2022 11:19 IST

Andhra News: ‘అమరావతి ఉద్యమం’పై సినిమా

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రాజధాని ఉద్యమం, దాని ఆవశ్యకత నేపథ్యంగా తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ అమరావతిలోని రాయపూడిలో శుక్రవారం ప్రారంభమైంది. అమరావతి ఐకాస సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు షాట్‌ను అమరావతి ఐకాస నాయకులు బెల్లంకొండ నరసింహారావు, పువ్వాడ సుధాకర్, చలపతిరావు, చంటి తదితరులు క్లాప్‌ కొట్టి ప్రారంభించారు. రాజధాని గ్రామాల రైతులు, కూలీలు, మహిళలు హాజరై చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అనంతరం రాయపూడిలోని ఒక ఇంటి పరిసరాల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. చిత్రానికి నిర్మాతగా కె.రవిశంకర్, డైరెక్టర్‌గా నరేంద్ర, కెమెరామెన్‌గా రవి వ్యవహరిస్తున్నారు. వినోద్‌కుమార్, వాణీ విశ్వనాథ్, నిఖిల్, రాణి తదితరులు నటిస్తున్నారు.  

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని