Mallu Swarajyam: మల్లు స్వరాజ్యంను అసెంబ్లీలోకి రానివ్వని బంట్రోతు!

తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన స్వరాజ్యం అసెంబ్లీలో తనకు ఎదురైన

Updated : 20 Mar 2022 11:23 IST

హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.  తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన స్వరాజ్యం.. అసెంబ్లీలో తనకు ఎదురైన ఘటనను తన జీవిత చరిత్రలో ఇలా వెల్లడించారు. ‘అప్పటి మా పార్టీకి చెందిన నర్సంపేట ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్‌తో కలిసి తొలిసారి అసెంబ్లీకి వెళ్లాను. ఓంకార్‌ కొంచెం ముందుగా అసెంబ్లీ లోపలికి వెళ్లిపోయాడు. నన్ను గేటు దగ్గర బంట్రోతు నిలిపివేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పినా నమ్మలేదు. ఓ ఉద్యమంలో పాల్గొని నేరుగా అసెంబ్లీకి వచ్చిన నా అవతారం చూసి నన్ను ఎమ్మెల్యే అనుకోవడం లేదతను. ఇంతలో ఓంకార్‌ వచ్చి నన్ను లోపలికి తీసుకుపోయాడు’ అని వివరించారామె. ‘నేను రూ.12 కంట్రోల్‌ చీర కట్టుకుని వచ్చిన. ఎమ్మెల్యే అంటే ఖద్దరు వేసుకుంటరు కదా అనే ఆలోచనలో బంట్రోతు ఉన్నడు’ అని ఆమె ఓ పుస్తకంలో పేర్కొన్నారు. ఆమె 1985 నుంచి 2005 వరకు ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘంలో చురుగ్గా పాల్గొన్నారు.   1993లో సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని