Whatsapp: కేరళ దొంగ కోసం ‘వాట్సప్‌ గ్రూప్‌’

దొంగతనానికి పాల్పడి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న

Published : 20 Mar 2022 11:02 IST

కాసరగోడ్‌: దొంగతనానికి పాల్పడి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పట్టుకునేందుకు కేరళలోని కాసరగొడ్‌ జిల్లా పోలీసులు సరికొత్త ఆలోచన చేశారు. ఆ దొంగ పేరు, ఫొటోతో వాట్సప్‌ గ్రూపు సృష్టించారు. అందులో స్థానికులను చేర్చి దొంగ సమాచారం ఏమాత్రం తెలిసినా గ్రూపులో పోస్టు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఈ గ్రూపులో 251 మంది సభ్యులు ఉన్నారు. పది రోజుల క్రితం.. అశోకన్‌ అనే దొంగ మడిక్కాయ్‌ గ్రామానికి చెందిన ఓ మహిళపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న హోస్దుర్గ్‌ పోలీసులు ఎంత వెదికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వాట్సాప్‌ గ్రూప్‌ ఆలోచన చేశారు. ఈ క్రమంలో అశోకన్‌ సన్నిహితుడు మంజునాథన్‌ను అరెస్టు చేశారు. దొంగ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి దాక్కొన్నట్లు తెలిసింది. తదుపరి సమాచారం కోసం పోలీసులు వాట్సాప్‌ సందేశాలపై నిఘా పెట్టారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని