వయసు 68 ఏళ్లు.. చకచకా కొబ్బరిచెట్లు ఎక్కేస్తున్న బామ్మ!

ఆమె వయసు 68 ఏళ్లు. కానీ యువకుల తరహాలో పారపట్టి పొలం పనులు చేస్తున్నారు. 

Updated : 21 Mar 2022 09:15 IST

ఆమె వయసు 68 ఏళ్లు. కానీ యువకుల తరహాలో పారపట్టి పొలం పనులు చేస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ కొబ్బరి చెట్టు ఎక్కి కాయలను కోస్తున్నారు. ఆమెనే.. కేరళకు చెందిన మరియమ్మకుట్టి. ఇడుక్కి జిల్లా ఇరుంబుపాలెం గ్రామానికి చెందిన మరియమ్మకుట్టి.. 22 ఏళ్ల వయసులో రైతుగా మారారు. పెళ్లైన కొన్నేళ్లకే భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లల పోషణ తనపై పడింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో సాగులో రాణించారు. మూడున్నర ఎకరాల భూమిలో సాగు ప్రారంభించారు. పశువులు, మేకలనూ చూసుకుంటారు. పార పట్టి వ్యవసాయం చేస్తారు. తన తోటలోని కొబ్బరికాయలు కోసేందుకు సైతం ఆమె ఇతరులపై ఆధారపడటం లేదు. కేరళ మహిళా స్వయం సహాయ బృందం శిక్షణకు హాజరై కొన్ని సంవత్సరాల క్రితమే కొబ్బరి చెట్టు ఎక్కడం నేర్చుకున్నారు. ఆమె ఆసక్తి గమనించిన వారు చెట్టు ఎక్కేందుకు ఉపయోగించే పరికరాన్ని బహూకరించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని