Uddhav Thackeray: ఎంఐఎం ప్రతిపాదన.. భాజపా కుట్రే: ఉద్ధవ్
మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో చేరుతామంటూ ఏఐఎంఐఎం చేసిన ప్రతిపాదనను శివసేన అధినేత,
ముంబయి: మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో చేరుతామంటూ ఏఐఎంఐఎం చేసిన ప్రతిపాదనను శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. హిందుత్వవాద పార్టీ అయిన శివసేనపై అపవాదులు మోపాలని భాజపా కుట్ర చేస్తోందని.. అందులో భాగంగానే తన ‘బి’ టీం పార్టీతో ఈ ప్రతిపాదన చేయించిందని ఆరోపించారు. ఆదివారం పార్టీ ఎంపీలు, ఆఫీస్ బేరర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం, భాజపాల మధ్య నిగూఢ అవగాహన ఉందని పేర్కొన్నారు.
ఆసక్తి లేదన్న పవార్
ఎంఐఎంతో పొత్తుకు తాము కూడా ఆసక్తి చూపడం లేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. ఆ పార్టీని కూటమిలో కలుపుకోవాలంటే ఎంవీఏలోని పార్టీలన్నీ అంగీకారం తెలపాల్సి ఉంటుందన్నారు. కేవలం రాష్ట్రస్థాయిలో చేయి కలిపేందుకే ఎంఐఎం ముందుకొచ్చిందని, ఈ తరహా పొత్తుకు మిగతా పార్టీల జాతీయ కమిటీల ఆమోదం కూడా అవసరమన్నారు. ఎంఐఎం ప్రతిపాదనను కాంగ్రెస్ సైతం తోసిపుచ్చింది. తొలుత భాజపా ‘బి’ టీం పార్టీని కాదని నిరూపించుకోవాలని సూచించింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి అధికారంలో ఉంది. ఈ కూటమిలో నాలుగో పార్టీగా చేరేందుకు తాము సిద్ధమని ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు, ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ శనివారం ప్రకటించడం చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?