Updated : 22 Mar 2022 10:44 IST

మలయాళ నటుడు సురేశ్‌గోపీ సోదరుడి అరెస్టు

మలయాళ నటుడు సురేశ్‌ గోపీ సోదరుడు సునీల్‌ గోపీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోయంబత్తూరులోని ఓ భూకుంభకోణానికి సంబంధించిన ఆరోపణలతో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిని విక్రయించడంతో సునీల్‌ గోపీని కోయంబత్తూరు పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కోయంబత్తూరులోని నవకరై ప్రాంతంలో మయిల్‌ సామికి చెందిన 4.52 ఎకరాలను సునీల్‌ గోపి కొనుగోలు చేశారు. ఆ స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ చెల్లదని కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు ఇచ్చిన తీర్పును సునీల్‌ అతిక్రమించి.. జీఎన్‌ మిల్స్‌ ప్రాంతానికి చెందిన గిరిధరన్‌కు దానిని విక్రయించాడు. ఇందుకుగాను గిరిధరన్‌ అడ్వాన్స్‌గా రూ.97 లక్షలు చెల్లించాడు. భూమి డాక్యుమెంట్లను పరిశీలించగా.. అది వేరొకరి పేరు మీద ఉందని తేలింది. దీంతో గిరిధరన్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని