Edible oil: వంటనూనెల సలసల.. ఏడాదిలో 20 నుంచి 44% దాకా పెరిగిన ధరలు

దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు ఏడాది కాలంలో భారీగా పెరిగిపోయాయి. కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ

Updated : 24 Mar 2022 10:37 IST

దేశీయంగా ఉత్పత్తికి.. డిమాండ్‌కు మధ్య 56% అంతరం ఉందన్న కేంద్రం

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు ఏడాది కాలంలో భారీగా పెరిగిపోయాయి. కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి బుధవారం లోక్‌సభకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆరు రకాల వంట నూనెల ధరలు గత ఏడాది కాలంలో కనిష్ఠంగా 20% నుంచి 44%దాకా పెరిగాయి. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న వంట నూనెలకు, డిమాండ్‌కు మధ్య దాదాపు 56% అంతరం ఉంటోందని, ఆ అగాధాన్ని దిగుమతుల ద్వారా పూడ్చుకోవాల్సి వస్తోందని ఆమె తెలిపారు. అంతర్జాతీయంగా నూనెల ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం దేశీయ ధరలపైనా కనిపిస్తున్నట్లు వెల్లడించారు. 2018-19లో దేశీయంగా 103.52 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2019-20లో 106.55 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2020-21లో 111.51 లక్షల మెట్రిక్‌ టన్నుల నూనె ఉత్పత్తి అయినట్లు చెప్పారు. ఇదే సమయంలో వరుసగా 155.7, 134.16, 134.52 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర దిగుమతి చేసుకున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. వినియోగదారులకు సబ్సిడీ ధరల్లో వంట నూనెలను పంపిణీ చేసే ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదని వెల్లడించారు. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని