Updated : 30 Mar 2022 10:30 IST

మరొకరితో పెళ్లి చేసుకుంటుందని స్నేహితురాలిని చంపబోయి.. మంటల్లో దహనమై

తన స్నేహితురాలు మరొకర్ని వివాహం చేసుకుంటుందని ఆమెను హత్య చేయాలనుకున్నాడో వ్యక్తి. ఈ క్రమంలో విఫలమై నిప్పంటించుకుని చనిపోయాడు. ఈ దారుణ ఘటన కేరళలోని కోజికోడ్‌లో జరిగింది. నడపురం గ్రామంలో రత్నేష్‌(41) ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. తన స్నేహితురాల్ని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ అందుకు పెద్దలు ఒప్పుకోలేదు. ఆమె పెళ్లిని మరొకరితో కుదిర్చారు. ఏప్రిల్‌లో ఆమె పెళ్లి పీటలెక్కాల్సి ఉంది. ఇది సహించలేని రత్నేష్‌.. స్నేహితురాల్ని హత్య చేయాలనుకున్నాడు. మంగళవారం వేకువజామున 2 గంటల సమయంలో బాధిత మహిళ ఇంటికి వెళ్లాడు. నిచ్చెన సహాయంతో ఆమె ఇంటి రెండో అంతస్తు ఎక్కి, బెడ్‌రూమ్‌కు నిప్పంటించాడు. మంటలు గమనించిన ఇంటిపక్క వ్యక్తి అందర్నీ పిలిచాడు. ఆ ఇంటివైపు అందరు పరుగులు పెడుతూ వస్తుండగా.. నిందితుడు కిందికి దిగి తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చూస్తుండగానే మంటల్లో కాలిపోయాడు. ఈ ఘటనలో బాధిత మహిళ, ఆమె సోదరుడు, వదిన గాయాలపాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని