ఎర్రచీరతో వందలాది ప్రాణాలు కాపాడిన బామ్మ

విరిగిపోయిన రైలు పట్టా... దూసుకొస్తున్న రైలు.. వేగంగా నడుచుకుంటూ వెళ్లి ఎవరికైనా చెప్పేంత ఓపిక లేదు..

Updated : 03 Apr 2022 10:55 IST

విరిగిపోయిన రైలు పట్టా... దూసుకొస్తున్న రైలు.. వేగంగా నడుచుకుంటూ వెళ్లి ఎవరికైనా చెప్పేంత ఓపిక లేదు.. ఈ పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించింది ఓ వృద్ధురాలు. తన ఒంటిపై ఉన్న ఎర్ర చీరనే అస్త్రంగా చేసుకుని రైలును ఆపి.. వందలాది మంది ప్రాణాలు కాపాడింది. ఆమెనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎటా జిల్లా గులేరియా గ్రామానికి చెందిన ఓంవతీ దేవి(65). గురువారం ఇంటి నుంచి పట్టాల మీదగా ఓంవతీ పొలానికి వెళ్తోంది. కుస్బా స్టేషన్‌ సమీపంలో పట్టా విరిగి ఉండడాన్ని గమనించింది. ఏ సమయంలోనైనా రైలు రావచ్చని భావించిన ఆమె.. ప్రమాదాన్ని నివారించాలని అనుకుంది. బాగా ఆలోచించిన ఓంవతీ దేవి.. తన ఒంటిపై ఎర్ర చీర విప్పి.. పట్టాలపై నిల్చుని జెండాలా ఊపడం ప్రారంభించింది. పట్టాలకు అడ్డంగా ఎర్ర చీరను కట్టింది. కాసేపటికే ఎటా నుంచి టుండ్లా వెళ్తున్న పాసింజర్‌ రైలు వచ్చింది. పట్టాలకు అడ్డంగా ఎర్ర వస్త్రం ఉండడాన్ని గమనించిన డ్రైవర్‌.. రైలును ఆపేశాడు. అక్కడ పట్టా విరిగిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశాడు. ఇంత సాయం చేసిన ఓంవతీ దేవికి రూ.100 నగదు పురస్కారం అందించాడు. ఓంవతీ దేవిపై అనేక మంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు