Crime News: దొంగ - పోలీస్‌.. ‘సరిగంగ’ స్నానాలు

ఓ నిందితుణ్ని పట్టుకురావడం కోసం మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లిన పోలీసులు..

Published : 06 Apr 2022 10:33 IST

బుర్హాన్‌పుర్‌: ఓ నిందితుణ్ని పట్టుకురావడం కోసం మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లిన పోలీసులు.. తిరుగు ప్రయాణంలో బేడీలతో ఉన్న ఆ నిందితుడితో కలిసి గంగానదిలో పవిత్ర సాన్నాలు చేయడం వివాదంగా మారింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారికి ఉన్నతాధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు ఓ అధికారి మంగళవారం వెల్లడించారు. యూపీలోని ప్రయాగరాజ్‌లో గత ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ స్నానాల వీడియో తాజాగా వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని లాల్‌బాఘ్‌ ఠాణా పోలీసులు ఓ ఛీటింగ్‌ కేసు నిందితుణ్ని అరెస్టు చేసేందుకు యూపీలోని ప్రతాప్‌గఢ్‌ వెళ్లారు. వెళ్లిన పని దిగ్విజయంగా పూర్తి చేసుకొని తిరిగివస్తూ మార్గమధ్యంలో ప్రయాగ్‌రాజ్‌ వద్ద గంగానదిలో స్నానాలు చేశారు. కొంగుముడి వేసుకున్న కొత్త దంపతులకు మల్లే.. చేతులకు బేడీలతో ఉన్న నిందితునితోపాటు పోలీసులు గంగలో మునకలు వేశారు. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి వైరల్‌ చేయగా, విషయం తాజాగా పోలీసుశాఖ దృష్టికి వెళ్లింది. యూపీ వెళ్లిన పోలీసుల బృందానికి ఎస్‌.ఐ. కేశవ్‌ పాటిల్‌ నేతృత్వం వహించారు. వీరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు బుర్హాన్‌పుర్‌ ఎస్పీ రాహుల్‌కుమార్‌ లోధా తెలిపారు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని