ఈ కారు ఖరీదు.. కేవలం రూ.16వేలు

సాధించాలనే పట్టుదల ఉంటే అసాధ్యమంటూ లేదని నిరూపించాడు కేరళకు చెందిన 17 ఏళ్ల కుర్రాడు ఇర్ఫాన్‌.

Updated : 07 Apr 2022 14:33 IST

సాధించాలనే పట్టుదల ఉంటే అసాధ్యమంటూ లేదని నిరూపించాడు కేరళకు చెందిన 17 ఏళ్ల కుర్రాడు ఇర్ఫాన్‌. పాత స్కూటీ చక్రాలు, కారు సీట్లు, బైక్‌ ఇంజిన్‌ను ఉపయోగించి ఓ కారునే తయారు చేశాడు. కేవలం రూ.16 వేలు ఖర్చు చేసి.. గంటకు 55 కి.మీ. వేగంతో నడిచే కారును రూపొందించాడు. నీలేశ్వరం ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్‌ ఎప్పటికైనా సొంతంగా ఓ కారును తయారు చేయాలనుకున్నాడు.  అందులో బాగంగా రూ.16 వేలతో నాలుగు పాత స్కూటీ టైర్లు, రెండు కారు సీట్లు, టాటా ఏస్‌ వాహనం స్టీరింగ్, ఓ బైక్‌ ఇంజిన్‌ను కొనుగోలు చేశాడు. వాటితో కారును రూపొందించే క్రమంలో మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఇర్ఫాన్‌..తన మిత్రుని సహకారం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి 20 రోజుల్లోనే కారును తయారు చేశారు. ప్రస్తుతం ఇంధనంతో నడిచే వాహనాన్ని రూపొందించానని, భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ వాహనం తయారుచేసేందుకు కృషి చేస్తున్నట్లు ఇర్ఫాన్‌ చెప్పాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని