Kashmir Files: ‘కశ్మీర్‌ ఫైల్స్‌’లో చెప్పని సత్యమిది..

జమ్మూ-కశ్మీర్‌లోని హిందూ పండిట్లు 1990ల్లో పెద్ద ఎత్తున వలసలు వెళ్లిన నేపథ్యంతో తెరకెక్కిన ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం ఇటీవల

Updated : 08 Apr 2022 10:47 IST

‘ది అన్‌టోల్డ్‌ కశ్మీర్‌ ఫైల్స్‌’ వీడియో విడుదల చేసిన కశ్మీర్‌ పోలీసులు 

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని హిందూ పండిట్లు 1990ల్లో పెద్ద ఎత్తున వలసలు వెళ్లిన నేపథ్యంతో తెరకెక్కిన ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ‘ది అన్‌టోల్డ్‌ కశ్మీర్‌ ఫైల్స్‌’ పేరుతో జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు ఓ లఘు చిత్రాన్ని రూపొందించారు. జమ్మూ-కశ్మీర్‌లో మతాలతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడూ ఉగ్రవాద కార్యకలాపాలకు బాధితులుగా మారారని అందులో పేర్కొన్నారు. 57 సెకన్ల ఈ వీడియోలో కశ్మీర్‌లో చోటుచేసుకున్న పలు ఉగ్రదాడులకు సంబంధించిన దృశ్యాలను పొందుపరిచారు. ప్రముఖ కవి ఫయజ్‌ అహ్మద్‌ ఫయజ్‌ రాసిన ‘హమ్‌ దేఖేంగే’ కవితను నేపథ్యంలో వినిపించారు. ఈ ప్రసిద్ధ కవితను ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంలోనూ వినియోగించారు. ‘‘లక్షిత దాడుల కారణంగా 20 వేల మంది కశ్మీరీలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి వ్యతిరేకంగా గళమెత్తాల్సిన సమయం వచ్చింది’’ అని వీడియోలో పేర్కొన్నారు. దీన్ని మార్చి 31న ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా 1.64 లక్షల మందికిపైగా వీక్షించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని