ఓ వైపు చితి మంటలు.. మరోవైపు డీజే స్టెప్పులు

అంతిమ సంస్కారాలు నిర్వహించే సమయంలో శ్మశానంలో వాతావరణం ఎలా ఉంటుంది. కుటుంబసభ్యులు

Published : 10 Apr 2022 11:36 IST

కాశీలోని బాబా మహాశ్మశాన్‌ నాథ్‌ ఆలయం వద్ద వింత సంప్రదాయం

అంతిమ సంస్కారాలు నిర్వహించే సమయంలో శ్మశానంలో వాతావరణం ఎలా ఉంటుంది. కుటుంబసభ్యులు, బంధువుల ఆర్తనాదాలు, కన్నీటితో నిండిపోయి ఉంటుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌ (కాశీ శ్మశానవాటిక) వద్ద ఇందుకు భిన్నంగా డీజే పాటలు, నృత్యాలు కనిపించాయి. ఓ వైపు చితి మంటలు మండుతూనే ఉండగా.. బాబా భోలేనాథ్‌ ముందు నగర్‌ వధువులు (నృత్యకారులు) నృత్యాలు చేశారు. వారిపై కొందరు నోట్ల వర్షం కురిపించారు.

ఎందుకంటే.. 
ఇలా చితి మంటల మధ్య నృత్యాలు, ప్రార్థనలు చేసే సంప్రదాయం 378 ఏళ్లుగా వస్తున్నట్లు బాబా మహాశ్మశాన్‌ నాథ్‌ ఆలయ అధికారి గుల్షాన్‌ కపూర్‌ తెలిపారు. ‘‘ఈ సంప్రదాయం వందల ఏళ్లుగా కొనసాగుతోంది. బాబా మహాశ్మశాన్‌ నాథ్‌ ఆలయాన్ని రాజా మాన్‌సింగ్‌ పునర్నిర్మించారు. ఆలయంలో పాటలు పాడడం, నృత్యాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆయన కలత చెందారు. ఈ విషయం నగరం మొత్తం వ్యాపించింది. సంస్థానంలోని నగర్‌ వధువులకు ఈ విషయం తెలిసింది. తమకు అవకాశం ఇస్తే నగరంలోని నృత్యాకారులంతా బాబా ముందు ప్రదర్శన చేసేందుకు వస్తారని రాజుకు తెలియజేశారు. వెంటనే వారికి అవకాశం లభించింది. అప్పటి నుంచి ఈ సంప్రదాయం నడుస్తోంది’’ చెప్పారు. చైత్ర నవరాత్రి తర్వాత ఏడో రోజు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నగర్‌ వధువులు మణికర్ణిక ధామ్‌కు చేరుకుని ఈ ఉత్సవాల్లో పాల్గొంటారన్నారు. మహా శ్మశాన్‌నాథ్‌ బాబా ఉత్సవాలు శవాలు కాలుతుండగానే నిర్వహిస్తారని చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని