భర్త పింఛను కోసం 56 ఏళ్ల న్యాయపోరాటం.. ఎట్టకేలకు విజయం

యుద్ధంలో అమరుడైన భర్త పింఛను కోసం 56 ఏళ్లు పోరాడిన మహిళ ఎట్టకేలకు విజయం సాధించింది.

Published : 14 Apr 2022 10:05 IST

యుద్ధంలో అమరుడైన భర్త పింఛను కోసం 56 ఏళ్లు పోరాడిన మహిళ ఎట్టకేలకు విజయం సాధించింది. బాధితురాలికి 6 శాతం వడ్డీతో మొత్తం పెన్షను చెల్లించాలని చండీగఢ్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. 1962 ఇండియా - చైనా యుద్ధంలో ప్రతాప్‌సింగ్‌ అనే సీఆర్పీఎఫ్‌ జవాను వీరమరణం పొందారు. తరవాత ప్రభుత్వం పింఛను ఆయన భార్య ధర్మోదేవికి ఇచ్చేది. ఉన్నట్టుండి 1966 నుంచి పెన్షను ఆగిపోయింది. బాధితురాలు చండీగఢ్‌ హైకోర్టును ఆశ్రయించి, 56 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది. జస్టిస్‌ హర్సిమాన్‌సింగ్‌ సేఠీ ధర్మాసనం ఇటీవల ఈ కేసును విచారించగా.. పింఛను ఆపేయడం తమ ఉద్దేశం కాదని.. సమాచారంలోపం వల్లే ఇలా జరిగిందని కేంద్రం, సీఆర్ఫీఎఫ్‌ హైకోర్టుకు తెలిపాయి. 56 ఏళ్లుగా చట్టబద్ధమైన హక్కులను బాధితురాలు కోల్పోయిందని.. అప్పటి నుంచి రావాల్సిన అన్ని అలవెన్సులు పొందేందుకు ఆమె అర్హురాలని బాధితురాలి తరఫు న్యాయవాది  వాదించారు. విచారణ అనంతరం.. ఆమెకు భత్యాలతోపాటు పింఛను పునరుద్ధరించాలని హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని