Published : 14 Apr 2022 09:52 IST

Love Marriage: కేరళలో ప్రేమ పెళ్లిపై రాజకీయ దుమారం

తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్‌లో ఓ ప్రేమపెళ్లి వ్యవహారం ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. సీపీఎం యువజన విభాగమైన డీవైఎఫ్‌ఐ నాయకుడు షిజిన్‌.. వేరొక మతానికి చెందిన జ్యోత్స్న మేరీ జోసెఫ్‌ను ప్రేమపెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 10న జ్యోత్స్న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టారు. ఇది లవ్‌జిహాద్‌ అని ఆరోపించారు. తమ కుమార్తెను కోర్టు ముందు హాజరుపరచాలని కోరుతూ జ్యోత్స్న తండ్రి కేరళ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. న్యాయస్థానం ఎదుట హాజరైన జ్యోత్స్న.. తాను తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి సిద్ధంగా లేనని చెప్పింది. అనంతరం హైకోర్టు యువజంటను విడుదల చేసింది. మరోవైపు, ఈ వ్యవహారంపై సీపీఎం కోజికోడ్‌ జిల్లా కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జార్జ్‌ ఎం థామస్‌ మంగళవారం చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. ‘‘లవ్‌ జిహాద్‌ అనేది నిజం. ఎస్‌డీపీఐ, జమాత్‌ ఏ ఇస్లామీ వంటి సంస్థలు బాగా చదువుకున్న ఇతర మతాల యువతులను ట్రాప్‌ చేసి లవ్‌ జిహాద్‌కు పాల్పడేలా ప్రోత్సహిస్తాయి. షిజిన్‌.. జ్యోత్స్నను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ముందే ఆ విషయాన్ని పార్టీకి తెలియజేయాల్సింది. దీని వల్ల ఈ ప్రాంతంలో పార్టీకి మద్దతుగా ఉండే వర్గం దూరమయ్యే పరిస్థితి వచ్చింది’’ అని థామస్‌ వ్యాఖ్యానించారు. దీంతో సీపీఎంపై విమర్శలు వెల్లువెత్తాయి.
తమ పెళ్లిపై వివాదం చెలరేగుతున్న సమయంలో షిజిన్, జ్యోత్స్నలు అలప్పుజలో మీడియాతో మాట్లాడారు. తమది లవ్‌జిహాద్‌ కానే కాదని స్పష్టం చేశారు. జీవితాంతం తాను తన మతంలోనే కొనసాగుతానని, షిజిన్‌ ఇందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని జ్యోత్స్న వివరణ ఇచ్చింది. 

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని