CBSE: రెండు టర్మ్‌లా.. ఒకే దఫాలోనా? ఎటూ తేల్చుకోని సీబీఎస్‌ఈ

త్వరలో ప్రారంభం కాబోయే 2022-23 విద్యా సంవత్సరంలో 10, 12వ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్షల విషయంలో ఎలాంటి విధానాన్ని అనుసరించాలన్నదానిపై కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.

Updated : 16 Apr 2022 11:09 IST

దిల్లీ: త్వరలో ప్రారంభం కాబోయే 2022-23 విద్యా సంవత్సరంలో 10, 12వ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్షల విషయంలో ఎలాంటి విధానాన్ని అనుసరించాలన్నదానిపై కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం తరహాలో రెండు టర్మ్‌లుగా విభజించాలా, లేక గతంలో మాదిరిగా ఒకే బోర్డు పరీక్ష విధానాన్ని తిరిగి తీసుకురావాలా అన్నదానిపై సమాలోచనలు కొనసాగుతున్నాయి. 2021-22లో బోర్డు పరీక్షలను రెండు టర్మ్‌లుగా నిర్వహించాలన్నది కేవలం కొవిడ్‌ మహమ్మారి విజృంభణను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న తాత్కాలిక నిర్ణయమని సీబీఎస్‌ఈ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ సన్యమ్‌ భరద్వాజ్‌ శుక్రవారం గుర్తుచేశారు. దాన్ని తదుపరి విద్యా సంవత్సరానికి పొడిగించాలో లేదో తగిన సమయంలో నిర్ణయిస్తామని చెప్పారు. రెండు టర్మ్‌ల్లో బోర్డు పరీక్షలను నిర్వహించడం ఇబ్బందికరంగా ఉందని పాఠశాలలు అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని