మహారాష్ట్రలో పాశవిక ఘటన.. భార్యపై సామూహిక అత్యాచారం చేయించిన భర్త!

మహారాష్ట్రలో పాశవిక ఘటన వెలుగుచూసింది. కుటుంబ కలహాల కారణంగా.. ఓ వ్యక్తి భార్యపై దారుణానికి 

Published : 18 Apr 2022 10:39 IST

మహారాష్ట్రలో పాశవిక ఘటన వెలుగుచూసింది. కుటుంబ కలహాల కారణంగా.. ఓ వ్యక్తి భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఔసా తాలూకా సారోలా వద్ద తన పొలం యజమాని, అతని సోదరుడిని పిలిపించి.. తన భార్యపై సామూహిక అత్యాచారం చేయించాడు. దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే.. బాధితురాలు తనపై అఘాయిత్యం జరిగిన అనంతరం అర్ధరాత్రి 15 కిలోమీటర్లు నడిచి లాతూర్‌లోని రెండు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. 

నిలంగా ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి సారోలా రోడ్‌ వద్ద వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఉంటోంది. కొద్దిరోజుల క్రితం దంపతుల మధ్య గొడవతో.. ఆమె లాతూర్‌లోని తన తల్లి వద్దకు వెళ్లిపోయింది. కుమార్తెకు సర్దిచెప్పిన ఆమె.. తిరిగి భర్త దగ్గర వదిలిపెట్టి వెళ్లింది. ఏప్రిల్‌ 9న దంపతుల మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త రాత్రి 9 గంటల సమయంలో తన పొలం యజమాని, అతడి సోదరుడు.. ఇల్లు షేక్, మూసా షేక్‌ను పిలిపించాడు. తన భార్యపై అత్యాచారం చేయాలని ప్రోత్సహించాడు. దీంతో వారిద్దరూ భర్త కళ్లెదుటే మహిళపై దారుణానికి పాల్పడ్డారు. ఘటన తర్వాత.. మహిళ అర్ధరాత్రి 15 కిలోమీటర్లు నడిచి స్థానిక పోలీస్‌స్టేషన్‌ సహా వివేకానందా చౌక్‌ ఠాణాను ఆశ్రయించినా ఎవరూ పట్టించుకోలేదు. జిల్లా ఎస్పీ నిఖిల్‌ పింగాలేను కలవాలని సూచించారు. ఆ తర్వాత బాధితురాలు తల్లితో సహా ఎస్పీని కలిసి తన గోడును వెళ్లబోసుకుంది. దీంతో నిందితులపై కేసు నమోదు చేయాలని ఎస్పీ ఔసా పోలీసులను ఆదేశించారు. అనంతరం ముగ్గురినీ అరెస్టు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని