భారతీయ కంపెనీలకు 60 మంది విదేశీ డైరెక్టర్లు.. వారిలో 40 మంది చైనా వ్యక్తులే..

 కంపెనీ నమోదుకు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించి, మోసపూరితంగా భారతీయ సంస్థలకు డైరెక్టర్లుగా 

Updated : 19 Apr 2022 11:03 IST

34 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసిన ఆర్థిక నేరాల విభాగం

ముంబయి: కంపెనీ నమోదుకు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించి, మోసపూరితంగా భారతీయ సంస్థలకు డైరెక్టర్లుగా మారిన మొత్తం 150 మందిపై ముంబయిలోని ఆర్థిక నేరాల విభాగం 34 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 60 మంది విదేశీ వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే, వీరిలో 40 మంది ఒక్క చైనాకు చెందినవారు కాగా... సింగపూర్, బ్రిటన్, తైవాన్, అమెరికా, సైప్రస్, యూఏఈ, దక్షిణ కొరియాలకు చెందినవారు మరో 20 మంది ఉన్నారు. వీరంతా ముంబయిలోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారనీ; ఈ వ్యవహారానికి సంబంధించి మరో నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయనున్నామని పోలీసు అధికారులు సోమవారం వెల్లడించారు. వీరితో పాటు 34 మంది ఛార్టర్డ్‌ అకౌంటెంట్లు, మరో 30 మంది కంపెనీ సెక్రటరీలపైనా ఆర్థిక నేరాల విభాగం ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసి, విచారణ చేపడుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని