Corona Virus: డెల్టా సోకి, టీకా తీసుకున్నా ఒమిక్రాన్ రావచ్చు: ఐసీఎంఆర్
డెల్టా కారణంగా కొవిడ్‌కు గురైన, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఏర్పడే రోగనిరోధక శక్తిని కూడా ఒమిక్రాన్ అధిగమిస్తోందని భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్ మూడు దశల్లో మహమ్మారికి గురైన వైద్య సిబ్బందిపై
దిల్లీ: డెల్టా కారణంగా కొవిడ్‌కు గురైన, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఏర్పడే రోగనిరోధక శక్తిని కూడా ఒమిక్రాన్ అధిగమిస్తోందని భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్ మూడు దశల్లో మహమ్మారికి గురైన వైద్య సిబ్బందిపై పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిపుణుడు డా.ప్రగ్యా యాదవ్ బృందం అధ్యయనం సాగించింది. టీకాల కారణంగా ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక స్పందనలు పెరిగినప్పటికీ... వాటికి మించిన సామర్థ్యం ఒమిక్రాన్‌కు ఉంటున్నట్టు పరిశోధకులు విశ్లేషించారు. అందుకే... మాస్కు ధరించడం, చేతుల శుభ్రత వంటి జాగ్రత్తలు అవసరమని నొక్కి చెప్పారు. ‘‘దిల్లీకి చెందిన 38 ఏళ్ల ఆరోగ్య సిబ్బంది ఒకరికి 2020లో తొలిసారి కరోనా సోకింది. కోలుకున్నాక కొవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్నారు. ఆ తర్వాతి ఉద్ధృతిలో డెల్టా సోకింది. ఒమిక్రాన్ కారణంగా మూడోసారి కూడా సదరు వ్యక్తి కొవిడ్‌కు గురయ్యారు! ఇన్ఫెక్షన్కు గురైన ప్రతిసారి స్వల్పంగానే లక్షణాలు ఉండటంతో, ఇంట్లోనే ఉండి చికిత్స పొందారు’’ అని డా.ప్రగ్యా యాదవ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.