టీ కోసం రైలునే ఆపేసిన డ్రైవర్‌.. విచారణ చేస్తామన్న రైల్వే అధికారులు

సాధారణంగా తేనీటి కోసం బస్సును ఆపడం చూసుంటాం.

Published : 25 Apr 2022 09:27 IST

సాధారణంగా తేనీటి కోసం బస్సును ఆపడం చూసుంటాం. అదే తేనీటి కోసం ట్రైన్‌ ఆగడం ఎప్పుడైనా చూశారా? బిహర్‌లోని సివాన్‌లో ఓ ట్రైన్‌ డ్రైవర్‌ టీ కోసం ఏకంగా ట్రైన్‌నే ఆపేశాడు. ఝాన్సీ నుంచి గ్వాలియర్‌ వెళుతున్న మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 5:27 గంటలకు సివాన్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుంది. ఇంతలో తేనీటి కోసం దిగిన గార్డు ఎక్కలేదని తెలుసుకున్న డ్రైవర్‌.. బయలుదేరాల్సిన సమయం కావడంతో రైలును క్రాసింగ్‌ వద్దకు తీసుకెళ్లి నిలిపివేశాడు. అనంతరం గార్డు తేనీరు తీసుకువచ్చి డ్రైవర్‌కు ఇచ్చాకే రైలు బయలుదేరింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై విచారణ చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని