
Crime News: పుట్టినరోజు వేడుకకు పిలిచి ప్రేయసికి నిప్పు
పాలక్కాడ్: తన పుట్టినరోజు వేడుకలు ఉన్నాయంటూ ఇంటికి పిలిచి 16 ఏళ్ల బాలికకు నిప్పంటించాడు ఓ యువకుడు. ఆ తర్వాత తానూ నిప్పుపెట్టుకున్నాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇరువురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కొల్లెంగోడ్ గ్రామానికి చెందిన బాలసుబ్రమణియం(23) తన పుట్టినరోజు ఉందంటూ ఆ బాలికను ఇంటికి పిలిచాడు. ఉదయం 7 గంటలకు ఇంటికి వెళ్లిన ఆమెను గదిలోకి తీసుకెళ్లి నిప్పంటించాడు. ఆ తర్వాత తానూ అంటించుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో బాలసుబ్రమణియం తల్లి, తమ్ముడు మాత్రమే ఉన్నారు. తీవ్ర గాయాలైన ఇరువురిని స్థానికుల సాయంతో తొలుత త్రిశూర్ వైద్య కళాశాలకు తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఎర్నాకులంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందారు. యువకుడు, యువతి ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. వారి ప్రేమను రెండు కుటుంబాలు నిరాకరించాయి. ఈ కారణంతోనే బాలసుబ్రమణియం బాలికకు నిప్పుపెట్టి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
-
Ap-top-news News
Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
-
Ap-top-news News
Andhra News: కలెక్టరమ్మా... కాలువల మధ్య ఇళ్లు కట్టలేమమ్మా!
-
Crime News
Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
-
General News
Heavy Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆత్మహత్యలే
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- అప్పుల కుప్పతో లంక తిప్పలు