మెక్సికో నుంచి అమెరికాకు భారీ సొరంగం!

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రపంచవ్యాప్తంగా దుండగులు భారీ సొరంగాలను ఏర్పాటు చేస్తున్నారు. మెక్సికోలోని టిజువానా నుంచి అమెరికాలోని శాన్‌ డియాగో ప్రాంతంలోని ఓ గిడ్డంగి

Published : 18 May 2022 06:06 IST

అందులో పట్టాలు, వెంటిలేషన్‌ వ్యవస్థలు

మాదకద్రవ్యాల అక్రమ తరలింపునకే..

శాన్‌ డియాగో: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రపంచవ్యాప్తంగా దుండగులు భారీ సొరంగాలను ఏర్పాటు చేస్తున్నారు. మెక్సికోలోని టిజువానా నుంచి అమెరికాలోని శాన్‌ డియాగో ప్రాంతంలోని ఓ గిడ్డంగి వరకూ విస్తరించిన భారీ సొరంగం ఒకటి తాజాగా వెలుగు చూసింది. భూగర్భంలో ఆరు అంతస్తులంత లోతున, 4 అడుగుల వెడల్పు, 532 మీటర్ల పొడవున దీన్ని నిర్మించారు. ఇందులో పట్టాలు, వెంటిలేషన్‌ వ్యవస్థలతో పాటు విద్యుత్తు సరఫరా, పటిష్టమైన గోడలు ఉండటంతో అధికారులు విస్తుపోయారు. అమిస్టడ్‌ పార్క్‌ పారిశ్రామిక ప్రాంతం వద్ద పోలీసులు ఇటీవల గస్తీ కాస్తుండగా.. ఓ పేరులేని గిడ్డంగి వద్ద చిన్న గుంత, అందులో ఓ నిచ్చెన కనిపించాయి. దీంతో వారు అనుమానం వచ్చి లోనికి దిగి చూడటంతో ఈ సొరంగం వెలుగు చూసింది. 2006 నుంచి ఇప్పటివరకూ మెక్సికో, కాలిఫోర్నియాల మధ్య ఇలాంటివి 15 సొరంగాలు బయటపడ్డాయి. డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసేందుకే దీన్ని వినియోగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దీని ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న 799 కిలోల కొకైన్‌, 75 కిలోల మెత్‌, 1.6 కిలోల హెరాయిన్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని