కవల సోదరుడి అఘాయిత్యం: భర్తనని నమ్మించి.. అన్న భార్యను వంచించి!

తల్లిలా చూసుకోవాల్సిన అన్న భార్యను వంచించి.. నెలల తరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన నిందితుడు తన అన్నావదినలు, కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు.

Updated : 22 May 2022 09:33 IST

ల్లిలా చూసుకోవాల్సిన అన్న భార్యను వంచించి.. నెలల తరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన నిందితుడు తన అన్నావదినలు, కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. వారిద్దరూ కవల సోదరులు కావడంతో చూడ్డానికి అచ్చంగా ఒకేలా ఉంటారు. ఎవరు ఎవరో గుర్తించడం ఎదుటివారికి కష్టంగానే ఉంటుంది. వారిలో పెద్దవాడికి 6 నెలల క్రితం వివాహమైంది. కొత్తగా ఆ కుటుంబంలోకి ప్రవేశించిన ఆ యువతి కూడా ఎవరు ఎవరో గుర్తించలేకపోయింది. దీన్నే అదనుగా తీసుకున్న నిందితుడు తన వదినపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. సోదరుడు లేని సమయంలో లైంగిక వాంఛ తీర్చుకునేవాడు. ఒకే పోలికతో ఉన్న కారణంగా ఆమె అతన్ని తన భర్తగానే భావించింది. 6 నెలల తర్వాత అసలు విషయాన్ని గుర్తించిన బాధితురాలు ఈ దారుణాన్ని తన భర్తకు చెప్పగా.. ఆశ్చర్యకరంగా ఆ సంబంధాన్నే కొనసాగించాలంటూ తేలిగ్గా తీసుకున్నాడు. అత్తింటివారు కూడా ఈ దారుణాన్ని సమర్ధించి అమానుషంగా వ్యవహరించారు. దీంతో బాధితురాలు అన్నదమ్ములిద్దరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కవల సోదరులపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని