బోనులో చిరుత సజీవదహనం

బోనులో చిక్కుకున్న చిరుతపులిని సజీవదహనం చేసిన అమానవీయ ఘటన ఉత్తరాఖండ్‌లో తాజాగా వెలుగుచూసింది. పౌరీ జిల్లా సప్లోడీ గ్రామానికి చెందిన ఓ మహిళ ఈ నెల 15న అడవిలోకి వెళ్లింది. చిరుత దాడిలో ఆమె ప్రాణాలు

Published : 26 May 2022 06:07 IST

ఉత్తరాఖండ్‌లో అమానవీయ ఘటన

దేహ్రాదూన్‌: బోనులో చిక్కుకున్న చిరుతపులిని సజీవదహనం చేసిన అమానవీయ ఘటన ఉత్తరాఖండ్‌లో తాజాగా వెలుగుచూసింది. పౌరీ జిల్లా సప్లోడీ గ్రామానికి చెందిన ఓ మహిళ ఈ నెల 15న అడవిలోకి వెళ్లింది. చిరుత దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అప్రమత్తమైన అధికారులు.. చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటుచేశారు. మంగళవారం చిరుత అందులో చిక్కింది. అధికారులు దాన్ని నాగదేవ్‌ రేంజ్‌ కార్యాలయానికి తరలిస్తుండగా.. సప్లోడీ సహా సార్నా, కుల్మోరీ గ్రామాలకు చెందిన దాదాపు 150 మంది అడ్డుకున్నారు. మహిళ మృతితో ఆగ్రహంగా ఉన్న వారు.. బోనుపై పెట్రోల్‌ పోసి నిప్పటించారు. దీంతో చిరుత సజీవదహనమైంది. ఈ ఘటనకు సంబంధించి సప్లోడీ సర్పంచ్‌ సహా 150 మందిపై అధికారులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని