
రాజస్థాన్ కాంగ్రెస్‌లో కాక!
నాయకత్వ మార్పుపై తీవ్ర చర్చ
ఈనాడు, జైపుర్: రాజస్థాన్ కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. రెండేళ్లుగా దీనిపై చర్చలు కొనసాగుతున్నా, శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు ఊపందుకొన్నాయి. ఈ అంశంపై పార్టీ అధిష్ఠానం జులైలో తన నిర్ణయం ప్రకటించే అవకాశముంది. కొద్దిరోజులుగా ఎమ్మెల్యేలు, దిగువస్థాయి నేతల్లో కదలిక కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్న దాదాపు 100 మంది నేతలు దిల్లీకి వెళ్లి అధిష్ఠానాన్ని కలవాలని యోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాయకత్వ మార్పును అంగీకరించబోమని వారు అంటున్నారు. తాము నిర్ణయం ప్రకటించే వరకూ ‘లక్ష్మణరేఖ’ దాటవద్దని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అజయ్ మకెన్ ఇప్పటికే స్థానిక నేతలను హెచ్చరించారు. పార్టీ విధేయునిగా అధిష్ఠానం దృష్టిలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు మంచి పేరే ఉంది. దీనికి తోడు ఇటీవలి ఉపఎన్నికల్లో పార్టీకి విజయం దక్కేలా చేయటం, ఉదయ్పుర్లో చింతన్ శిబిర్ నిర్వహించటం ద్వారా పార్టీ అగ్రనాయకత్వాన్ని ఆయన మరింత ప్రసన్నం చేసుకోగలిగారు. తరచూ దిల్లీ వెళుతూ అగ్రనేతలతో మంతనాలు జరుపుతున్నారు.
దిల్లీలో పైలట్
మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ రెండు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం దిల్లీ వెళ్లారు. అగ్రనేతలతో ఆయన భేటీ అయ్యే అవకాశముందని చెబుతున్నారు. ఎన్నికలకు ఏడాది సమయమే ఉన్నందున... సచిన్ మద్దతుదారుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈదఫా తమ నేతకు తప్పనిసరిగా అవకాశం లభిస్తుందని ఆయన మద్దతుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నామని, నాయకత్వ మార్పుపై తీవ్ర వ్యతిరేకత వస్తే మాత్రం... ఆ ఆలోచనను పక్కన పెడతామని అధిష్ఠానం నుంచి సంకేతాలు అందుతున్నట్టు కొందరు నేతలు చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
covid update: వీడని మహమ్మారి పీడ.. తెలంగాణలో కొత్తగా 457 కరోనా కేసులు
-
Sports News
IND vs ENG: రెండో సెషన్ పూర్తి.. నిలకడగా ఆడుతున్న విహారి, పుజారా
-
Sports News
Bumrah - Broad : బ్రాడ్‌కు బుమ్రా చుక్కలు.. నెట్లో వీరేంద్ర సెహ్వాగ్ చమక్కు
-
India News
Maharashtra: ప్రభుత్వం నేతలే ప్రతిపక్షంగా మారారు.. సీఎం పదవి దక్కడం యాదృచ్ఛికం: శిందే
-
India News
IndiGo: ఒకేరోజు వందల మంది ఉద్యోగులు ‘సిక్‌లీవ్’..! 900 సర్వీసులు ఆలస్యం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Rashmika: విజయ్ దేవరకొండ.. ఇక అందరికీ నీ పేరే చెబుతా: రష్మిక
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి