వయసు 106 ఏళ్లు.. ఇంతవరకు షుగర్‌, బీపీ దరిచేరలేదు!

పంజాబ్‌లోని బఠిండాకు చెందిన ఓ శతాధిక వృద్ధురాలు ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా పనులు చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పాకిస్థాన్‌లో పుట్టి పెరిగిన బేబే సరోజ్‌ రాణి.. పంజాబ్‌ వ్యక్తిని వివాహం చేసుకుని అప్పటి నుంచి

Updated : 23 Jun 2022 09:55 IST

పంజాబ్‌లోని బఠిండాకు చెందిన ఓ శతాధిక వృద్ధురాలు ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా పనులు చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పాకిస్థాన్‌లో పుట్టి పెరిగిన బేబే సరోజ్‌ రాణి.. పంజాబ్‌ వ్యక్తిని వివాహం చేసుకుని అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 106 ఏళ్లు వచ్చినా రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు ఇంతవరకు ఈ వృద్ధురాలి దరిచేరలేదు. ఆహారపు అలవాట్లే తన ఆరోగ్య రహస్యమని బేబే చెబుతారు. ప్రస్తుత రోజుల్లో ఆహారంలో నాణ్యత లోపిస్తుందని, అందువల్లే రోగాలు బాగా పెరిగాయని అంటారు. ఇప్పటికీ తాను ప్రతిరోజు దేశీ నెయ్యిని ఉపయోగిస్తుంటానని, తన రోజువారీ ఆహారంలో కచ్చితంగా నెయ్యి ఉంటుందని వెల్లడించారు. ‘‘కొన్నాళ్ల క్రితం నా మనవడికి పెళ్లి చేశాను. వారు తమ రోజువారీ పనులకు వెళితే పిల్లలను నేనే జాగ్రత్తగా చూసుకుంటాను. ముఖ్యంగా ప్రతిరోజు ఆహారాన్ని సరైన సమయంలో తీసుకుంటే ఎటువంటి వ్యాధులు దరిచేరవు’’ అని వెల్లడించారు. 106 ఏళ్లు వచ్చినా తాను ఇప్పటికీ శరవేగంగా పరుగెత్తగలనని,  రోజూ పది కిలోమీటర్లకు పైగా నడుస్తానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని