వితంతువులను విడిచిపెట్టడం.. సాంఘిక దురాచారం

వితంతువులను వారి కుమారులు, బంధువులు విడిచిపెట్టే ఆచారం సాంఘిక దురాచారమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది దేశ సంస్కృతి మచ్చని స్పష్టంచేశారు. వితంతువులకు పునర్వివాహం, ఆర్థిక

Published : 28 Jun 2022 05:54 IST

మథుర పర్యటనలో రాష్ట్రపతి కోవింద్‌

ఈనాడు, లఖ్‌నవూ: వితంతువులను వారి కుమారులు, బంధువులు విడిచిపెట్టే ఆచారం సాంఘిక దురాచారమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది దేశ సంస్కృతి మచ్చని స్పష్టంచేశారు. వితంతువులకు పునర్వివాహం, ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఈ సందర్భంగా ఆయన సమర్థించారు. సోమవారం కుటుంబ సమేతంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు.. గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లతోపాటు పలువురు నేతలు, ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఉదయం పదిన్నర గంటల సమయంలో లార్డ్‌ బాంకే బిహారీ ఆలయానికి రాష్ట్రపతి చేరుకుని పూజలు చేశారు. అనంతరం కృష్ణకుటీర్‌ ఆశ్రయ్‌ సదన్‌కు వెళ్లారు. అక్కడ కొందరు పేద, వితంతు మహిళలతో రాష్ట్రపతి మాట్లాడారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణకుటీర్‌ ఆశ్రయ్‌ సదన్‌ ఏర్పాటును ప్రశంసించారు. అదే సమయంలో తన అభిప్రాయం ప్రకారం సమాజంలో ఇలాంటి షెల్టర్ల అవసరం లేదని స్పష్టంచేశారు. ‘‘చాలా మంది మహిళలను వారి కుమారులు లేదా కుటుంబసభ్యులు వృందావన్‌లో విడిచిపెడుతున్నారు. తర్వాత కనీసం వారు ఎలా ఉన్నారో అన్న సంగతిని తెలుసుకునేంద]ుకు సైతం రావడం లేదు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఈ సాంఘిక దురాచారం దేశ సంస్కృతికి మచ్చ. ఈ కళంకాన్ని ఎంత త్వరగా తొలగిస్తే అంత మంచిది’’ అని రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాఖ్యానించారు. లార్డ్‌ బాంకే బిహారీ ఆలయాన్ని సందర్శించుకునేందుకు రాష్ట్రపతి హోదాలో రామ్‌నాథ్‌ మథురలో పర్యటించడం ఇది రెండోసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని