Corona: ‘దక్షిణ’ బెలూన్లే కరోనాను మోసుకొచ్చాయి

ఉత్తర కొరియాలో కొవిడ్‌ ప్రబలడం వెనుక.. ఆ దేశం ఓ వింతైన కారణాన్ని తెరపైకి తెచ్చింది. పొరుగున ఉన్న దక్షిణ కొరియాను నిందించే ప్రయత్నం చేసింది. ఆ దేశం నుంచి గాల్లో ఎగురుకుంటూ

Updated : 02 Jul 2022 08:09 IST

ఉత్తర కొరియా వింత వాదన

సియోల్‌: ఉత్తర కొరియాలో కొవిడ్‌ ప్రబలడం వెనుక.. ఆ దేశం ఓ వింతైన కారణాన్ని తెరపైకి తెచ్చింది. పొరుగున ఉన్న దక్షిణ కొరియాను నిందించే ప్రయత్నం చేసింది. ఆ దేశం నుంచి గాల్లో ఎగురుకుంటూ వచ్చిన బెలూన్ల వల్లే తమ దేశంలో కొవిడ్‌ వ్యాప్తి ప్రారంభమై ఉండొచ్చన్న అభిప్రాయాన్ని శుక్రవారం వ్యక్తం చేసింది. ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఈ వాదన వివాదాస్పదంగా మారింది. అయితే ద.కొరియా దీన్ని తోసిపుచ్చింది. ఏళ్ల తరబడి పలువురు కార్యకర్తలు ఉ.కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను విమర్శిస్తూ సరిహద్దు వెంబడి కరపత్రాలు వంటివాటితో కూడిన బెలూన్లను వదులుతుంటారు. దీనిపై  ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు