రయ్‌మని ఎగిరింది.. ఠీవిగా తిరిగింది!

మానవ రహిత యుద్ధ విమానాల తయారీలో మన దేశం స్వయం సమృద్ధి సాధించడానికి మరెంతో కాలం వేచి చూడాల్సిన పనిలేదు.

Published : 03 Jul 2022 06:39 IST

మానవ రహిత యుద్ధ విమాన ప్రయోగం విజయవంతం

చిత్రదుర్గం, న్యూస్‌టుడే: మానవ రహిత యుద్ధ విమానాల తయారీలో మన దేశం స్వయం సమృద్ధి సాధించడానికి మరెంతో కాలం వేచి చూడాల్సిన పనిలేదు. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా నాయకనహట్టి దగ్గర ఉన్న డీఆర్‌డీవో ఏరోనాటికల్‌ టెస్టు రేంజ్‌లో శుక్రవారం నిర్వహించిన రిమోట్‌ కంట్రోల్డ్‌ మానవ రహిత యుద్ధ విమాన ప్రయోగం విజయవంతమైనట్లు అధికారులు శనివారం ప్రకటించారు. ఈ విమానాన్ని పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. పరీక్షల్లో భాగంగా రన్‌వేపై విజయవంతంగా ఎగిరిన విమానం 15 నిమిషాలపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. నిర్దేశించిన రీతిలో తిరిగి రన్‌వేపై దిగింది. మానవ రహిత యుద్ధ విమానాల తయారీకి డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు దశాబ్దం కిందట శ్రీకారం చుట్టారు. మొదట్లో నిర్వహించిన రెండు ప్రయోగాలు విఫలమైనా... రెండున్నరేళ్లుగా కొవిడ్‌ వల్ల ఆటంకం ఏర్పడినా శాస్త్రవేత్తలు వెనుకంజ వేయలేదు. అనుకున్న రీతిలో యుద్ధ విమానాన్ని సిద్ధం చేశారు. ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు