పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో..పెట్రోల్‌ బంకులు, రేషన్‌ దుకాణాలు!

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్‌) ఇకపై పెట్రోల్‌ ఉత్పత్తుల విక్రయాలు, రేషన్‌ దుకాణాల సేవలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల అభివృద్ధి తదితర అదనపు కార్యకలాపాల నిర్వహణకు అనుమతించాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి

Published : 05 Jul 2022 05:55 IST

సేవల విస్తరణకు ముసాయిదా నిబంధనలు విడుదల
సూచనలు ఆహ్వానించిన కేంద్రం

దిల్లీ: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్‌) ఇకపై పెట్రోల్‌ ఉత్పత్తుల విక్రయాలు, రేషన్‌ దుకాణాల సేవలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల అభివృద్ధి తదితర అదనపు కార్యకలాపాల నిర్వహణకు అనుమతించాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి సంబంధించి కేంద్ర సహకార మంత్రిత్వశాఖ ‘పీఏసీఎస్‌ ముసాయిదా నిబంధనలు’ సోమవారం విడుదల చేసింది. బ్యాంకు మిత్ర, సాధారణ సేవల కేంద్రాలు(సీఎస్‌సీ), గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, డెయిరీ, మత్స్య, నీటిపారుదల, స్వచ్ఛ ఇంధనం రంగాల్లోనూ పీఏసీఎస్‌లు సేవలు విస్తరించేందుకు ఈ ముసాయిదా అవకాశం కల్పిస్తోంది. దీనిపై రాష్ట్రాలు, సంబంధిత విభాగాలు ఈ నెల 19లోపు సూచనలు, సలహాలు ఇవ్వాలని.. సహకార రంగ 100వ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సదస్సులో కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్‌షా కోరారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో వచ్చే అయిదేళ్లలో కంప్యూటర్‌ సేవలను అందుబాటులోకి తేవాలని గత వారం కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని