నగలు వద్దన్న వధువు..7 పేద కుటుంబాలకు వెలుగు

పెళ్లంటే.. ఏ వధువైనా ఖరీదైన దుస్తులు, నగలు ధరించి జరుపుకుంటుంది. కానీ కేరళకు చెందిన షెహ్నా షెరి అ

Published : 21 Jan 2022 11:33 IST

పెళ్లంటే.. ఏ వధువైనా ఖరీదైన దుస్తులు, నగలు ధరించి జరుపుకుంటుంది. కానీ కేరళకు చెందిన షెహ్నా షెరి అనే యువతి మాత్రం స్తోమత ఉన్నప్పటికీ నగలు లేకుండానే వివాహం చేసుకుంది. అందుకయ్యే ఖర్చును 7 పేద కుటుంబాలకు సాయంగా పంచింది. కోజికోడ్‌ జిల్లా మయపయ్యూర్‌కు చెందిన అంత్రు-రంలా దంపతుల కుమార్తె షెహ్నా షెరికి.. కొట్టపల్లికి చెందిన మహమ్మద్‌ షఫీతో పెళ్లి నిశ్చయమైంది. షెహ్నా తన వివాహాన్ని సాధారణంగా జరుపుకుని మిగిలే డబ్బుతో పేదలకు సహాయం చేయాలనుకుంది. ఆమె నిర్ణయాన్ని తల్లిదండ్రులు, వరుడు అంగీకరించడంతో పెళ్లితంతును నిరాడంబరంగా ముగించారు. పెళ్లి వేదికపైనే 21 సెంట్ల భూమిని నాలుగు నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేశారు. ఓ పేద వ్యక్తికి ఇంటిని నిర్మించి ఇచ్చారు. మరొకరి ఆస్పత్రి చికిత్సకు డబ్బు అందించారు. ఓ పేద అమ్మాయి వివాహ ఖర్చును భరించారు. దగ్గర్లోని డయాలసిస్‌ సెంటర్‌కు కూడా విరాళం ఇచ్చారు. ఇలా తమ సంతోషాన్ని నలుగురికీ పంచి ప్రశంసలందుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని