mask : మహారాష్ట్రలో మాస్కులు తప్పనిసరి కాదు..

 దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో కొవిడ్‌

Published : 01 Apr 2022 10:30 IST

దిల్లీ/ముంబయి: దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనల ఎత్తివేతకు పలు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. మహారాష్ట్రలో మాస్కులు ధరించడం తప్పనిసరి నిబంధనను కూడా ఎత్తివేయడానికి నిర్ణయించారు. దేశ రాజధాని దిల్లీలోనూ మాస్కులు ధరించనివారిపై ఇంతవరకు విధిస్తున్న జరిమానాను ఎత్తివేయడానికి దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో ఏప్రిల్‌ 2 (మరాఠీ నూతన సంవత్సరం) నుంచి అన్ని నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని