Monkey: బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌లో కోతి.. పోలీస్‌ షూటౌట్‌లో మృతి

మెక్సికోలో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించిన కోతి కాల్పుల్లో చనిపోయింది. స్మగ్లర్లకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లో కోతి మరణించింది. ఈ కోతిని.. చనిపోయిన స్మగ్లర్ల బృందానికి

Updated : 20 Jun 2022 08:34 IST

మెక్సికోలో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించిన కోతి కాల్పుల్లో చనిపోయింది. స్మగ్లర్లకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లో కోతి మరణించింది. ఈ కోతిని.. చనిపోయిన స్మగ్లర్ల బృందానికి చెందిన ఓ వ్యక్తి పెంచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. మెక్సికోలో సాధారణంగా డ్రగ్‌ స్మగ్లర్లు తమ హోదాకు చిహ్నంగా జంతువులను పెంచుకుంటారు. ఇలాగే ఈ కోతిని పెంచుకున్నట్లు తెలుస్తోంది. ‘ల ఫామిలియా మిచోవాకనా’ ముఠాకు చెందిన అతడి వయసు 20ల్లోనే ఉంటుందని స్థానిక వార్తా సంస్థ తెలిపింది. కొన్ని బుల్లెట్లు అతడి శరీరానికి తగిలాయని పేర్కొంది. అతడు పెంచుకుంటున్న కోతికి సైతం బుల్లెట్‌ గాయమైందని తెలిపింది. ఛాతిలో తూటా దిగడం వల్ల కోతి అక్కడికక్కడే చనిపోయిందని స్పష్టం చేసింది. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ వేసుకున్న ఆ కోతి.. ప్రాణాలు కోల్పోయి నేల మీద పడి ఉన్న చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బుల్లెట్‌ గాయం వల్లే కోతి మరణించిందా? అన్న అంశంపై ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు. కోతి మృతదేహానికి పశువైద్యుడి ఆధ్వర్యంలో శవపరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కోతి స్మగ్లర్లదే అని నిర్ధరణ అయితే.. పట్టుబడ్డ నిందితులపై జంతువుల అక్రమ రవాణా నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఎన్‌కౌంటర్‌లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మందుగుండు సామగ్రి, ఆయుధాల క్యాట్రిడ్జ్‌లు, పలు వాహనాలను సైతం జప్తు చేశారు. అరెస్టు చేసిన నిందితుల్లో 15 ఏళ్ల బాలుడు సైతం ఉన్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని