జ్ఞాపకశక్తితో ఔరా ఈ పిల్ల.. అసాధ్యురాలు

కేరళలోని కాసరగోడ్‌కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి బాల పార్వతి తన జ్ఞాపకశక్తితో ఔరా అనిపిస్తోంది.

Published : 02 Dec 2021 09:59 IST

తిరువనంతపురం: కేరళలోని కాసరగోడ్‌కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి బాల పార్వతి తన జ్ఞాపకశక్తితో ఔరా అనిపిస్తోంది. మంత్రుల పేర్లను చకచకా చెప్పేస్తోంది. అంతేకాదు.. స్వాతంత్య్ర సమరయోధులు, పలు దేశాల జెండాల ఫొటోలను తన ముందు పెడితే ఇట్టే గుర్తుపడుతోంది. ఈ అసాధారణ ప్రతిభతోనే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకుంది. కాసరగోడ్‌కు చెందిన హరీశ్, సుకన్య దంపతుల ఏకైక కుమార్తె బాల పార్వతి. ఏడాది వయసులోనే తన కుమార్తెలో ప్రత్యేక ప్రతిభను వారు గుర్తించారు. జనరల్‌ నాలెడ్జ్‌ సహా పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే నేపథ్య సంగీతం విని.. ఆ పాటలను పసిగట్టే నైపుణ్యాన్ని పార్వతి సొంతం చేసుకుంది. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో పాటలను పాడేస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని