FDA: కొవిడ్‌ మాత్ర వినియోగానికి.. అమెరికా ఎఫ్‌డీఏ సానుకూలం

అంతర్జాతీయ ఫార్మా సంస్థ మెర్క్‌ రూపొందించిన కొవిడ్‌ ఔషధం మోల్నూపిరవిర్‌ వినియోగంపై అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌

Published : 02 Dec 2021 12:42 IST

వాషింగ్టన్‌: అంతర్జాతీయ ఫార్మా సంస్థ మెర్క్‌ రూపొందించిన కొవిడ్‌ ఔషధం మోల్నూపిరవిర్‌ వినియోగంపై అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌కు(ఎఫ్‌డీఏ) చెందిన ఆరోగ్య సలహాదారుల కమిటీ సానుకూలంగా స్పందించింది. దీంతో ఈ ఔషధం త్వరలోనే అమెరికా పౌరులు వినియోగించేందుకు మార్గం సుగమం అయింది. గర్భధారణ సమయంలో ఈ ఔషధాన్ని వినియోగిస్తే.. శిశువులకు పుట్టుకతో వచ్చే లోపాలు రావని, వివిధ ముప్పులను అధిగమిస్తుందని కమిటీలో 13-10 మంది ఓటు వేశారు. ఈ ఔషధ ప్రయోజనాలపై చర్చ జరిగిన తర్వాత ఈ మేరకు కమిటీ ఆమోదించింది. ఈ ఔషధాన్ని గర్భిణులు ఉపయోగించే విషయంపై దృష్టి సారించాలని ఎఫ్‌డీఏకు కమిటీ సూచించింది. వృద్ధులు, ఆస్తమా, ఊబకాయం వంటి వ్యాధులు ఉన్నవారు సహా అత్యధిక ముప్పును ఎదుర్కొనే వయోజనులు ఈ ఔషధం ఉపయోగించవచ్చని కమిటీ తెలిపింది. వ్యాక్సిన్‌ తీసుకున్నవారు ఈ ఔషధాన్ని వినియోగించొచ్చా? వద్దా? అన్నదానిపై పరిశోధన జరగనందున.. వారు ఈ మాత్రను వినియోగించకూడదని కమిటీలో చాలా మంది సభ్యులు పేర్కొన్నారు. మోల్నూపిరవిర్‌ మాత్రపై ప్యానెల్‌ చేసిన సూచనలపై ఎఫ్‌డీఏ పూర్తిగా ఆధారపడదు. ఈ ఏడాది చివరికల్లా ఈ ఔషధ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపే విషయంపై సొంతంగా నిర్ణయం తీసుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు