
Crime News: పట్టపగలు గ్యాంగ్‌రేప్.. నేరుగా స్టేషన్‌కు మహిళ!
ఒంటరిగా వెళ్తున్న గిరిజన వివాహితను ఇద్దరు దుండగులు పట్టపగలే దారిలో అడ్డగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. తేరుకున్న బాధిత మహిళ ఒంటిపై చీర లేకుండానే 500 మీటర్ల దూరంలో ఉన్న బాఘ్పూరా చౌక్‌కు వెళ్లింది. అక్కడ ఉన్నవాళ్లకు తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. వారి సాయంతో పోలీస్‌స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ అమానుష ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పుర్ జిల్లాలో వెలుగు చూసింది. సమాచారం అందిన వెంటనే ఉదయ్‌పుర్ ఎస్పీ మనోజ్ చౌదరి, ఝాఢోల్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి నుంచి మహిళ చీర, ఓ చేతి గడియారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరిసర ప్రాంతం వారేనని అనుమానిస్తున్నారు. ఆమెను వైద్యపరీక్షలకు పంపించి.. వారి కోసం గాలింపు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.