Jasprit Bumrah: టెక్నికల్‌గా మార్పులు లేవు..మైండ్‌ సెట్‌ని సర్దుబాటు చేసుకున్నా 

ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో  టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా ఘోరంగా విఫలమయ్యాడు.

Published : 08 Aug 2021 21:00 IST

(Twitter:Jasprit Bumrah)

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో  టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా ఘోరంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో 36.4 నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా..ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తిరిగి మునుపటి లయను అందుకున్నాడు.  తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.

తాను తిరిగి ఫామ్‌లోకి రావడంపై బుమ్రా స్పందించాడు. మునుపటి లయను అందుకోవడానికి  టెక్నికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదని, కేవలం మైండ్‌ సెట్‌ని సర్దుబాటు చేసుకున్నానని పేర్కొన్నాడు. ‘నిజం చెప్పాలంటే భారీ మార్పులేమీ చేయలేదు. కేవలం మైండ్‌సెట్‌ని సర్దుబాటు చేసుకున్నా. ప్రస్తుతం నా నైపుణ్యాలను తిరిగి పొందడానికి, ఆటను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ దానికి  కొత్త విషయాలను  జోడించడానికి ప్రయత్నిస్తున్నా’ అని బుమ్రా అన్నాడు.ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బుమ్రా బ్యాట్‌తోనూ అలరించాడు. కేవలం 34 బంతుల్లోనే  28 పరుగులు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని