IND VS ENG: విజయానికి చేరువలో భారత్
రెండో సెషన్లో భారత బౌలర్లు విజృంభించారు. వెంట వెంటనే కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. 27.1 ఓవర్ల పాటు సాగిన ఈ సెషన్లో భారత బౌలర్లు 55 పరుగులిచ్చి 6 వికెట్లు తీశారు.
ఇంటర్నెట్‌డెస్క్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో సెషన్లో భారత బౌలర్లు విజృంభించారు. వెంట వెంటనే కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. దీంతో టీ విరామ సమయానికి ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 175 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో రెండే వికెట్లు ఉండడంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లాండ్ గెలవడం అసాధ్యం. ప్రస్తుతం ఓవర్టన్ (3) క్రీజులో ఉన్నాడు.
క్రీజులో పాతుకుపోయిన ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ హసిబ్ హమీద్ (63)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లాండ్‌ను దెబ్బ తీశాడు. అక్కడికి కొద్ది సేపటికే ఓలీ పోప్ (2)ని, తర్వాతి ఓవర్లో మొయిన్ అలీ (0)ని బుమ్రా పెవిలియన్‌కు పంపించాడు. వరుసగా వికెట్లు కోల్పోతుండటంతో నిలకడగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న కెప్టెన్ జో రూట్ (36)ను సైతం శార్ధూల్ ఠాకూర్ బౌల్డ్ చేశాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్ (18)ను క్యాచ్ ఔటయ్యాడు. దీంతో కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా విజయానికి 175 పరుగులు చేయాల్సి ఉండడంతో భారత్ విజయం లాంఛనం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్‌దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్‌లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్‌రైడర్స్ కోచ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్‌కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్‌కతా నైట్‌రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం