
Rohit Sharma: రోహిత్ అరంగేట్రానికి 15 ఏళ్లు.. ఎమోషనల్ అయిన హిట్‌మ్యాన్
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటికి సరిగ్గా 15 ఏళ్లు అవుతోంది. 2007 జూన్ 23న ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ అరంగేట్రం చేశాడు. 15 ఏళ్ల క్రికెట్ కెరీర్ పూర్తి చేసుకున్న విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటూ హిట్‌మ్యాన్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ‘అందరికీ నమస్కారం. నాకు ఇష్టమైన జెర్సీ (టీమ్ఇండియా జెర్సీ)లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నా. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు పూర్తిచేసుకుంటున్నాను. ఇది అద్భుతమైన ప్రయాణం. తప్పకుండా క్రికెట్‌ని నా జీవితాంతం ఆదరిస్తాను. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను ఆటగాడిగా ఈ స్థాయిలో ఉండటానికి సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. క్రికెట్ ప్రేమికులు, అభిమానులు, విమర్శకులందరికీ ధన్యవాదాలు. జట్టు పట్ల మీకున్న ప్రేమ, మీ మద్దతు వల్లే మనమందరం అనివార్యంగా ఎదురయ్యే ఎన్నో అడ్డంకులను అధిగమించాం. ప్రస్తుతం భారత క్రికెటర్ల పట్ల మీరు చూపుతున్న ప్రేమాభిమనాలు మన జట్టును ఈ స్థాయిలో ఉంచాయి. మీ అందరికీ ధన్యవాదాలు’ అని రోహిత్ శర్మ తన ట్విటర్ ఖాతాలో లేఖను పోస్ట్ చేశాడు.
విరాట్ కోహ్లీ నుంచి టీ20 జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ కొద్ది కాలంలోనే అన్ని ఫార్మాట్లలో టీమ్ఇండియా కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. ప్రస్తుతం రోహిత్ నాయకత్వంలో టీమ్ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. గతేడాది ఇంగ్లాండ్, భారత్ మధ్య జరగాల్సిన ఐదో (చివరి టెస్టు) మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ టెస్టు జులై 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమ్ఇండియా 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టుని భారత్ గెలిచినా.. డ్రా చేసుకున్నా సిరీస్‌ని సొంతం చేసుకుంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ENG vs IND: ఆ ‘తుపాన్’ మన మీదకొస్తే..!
-
Crime News
Prayagraj: కుమార్తె మృతదేహంతో ఐదు రోజులుగా ఇంట్లోనే.. బతికించేందుకు క్షుద్రపూజలు
-
General News
Health: యోగా చేయండి.. జ్ఞాపక శక్తి పెంచుకోండి
-
Movies News
Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
-
Politics News
బిహార్‌లో మజ్లిస్‌కు షాక్.. నలుగురు ఎమ్మెల్యేలు జంప్!
-
India News
GST: గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఇకనుంచి ‘కుటుంబ సర్వనాశన ట్యాక్స్’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Viral Video: గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Mahesh babu: బిల్ గేట్స్‌తో మహేశ్‌బాబు.. పిక్ వైరల్.. ఎక్కడ కలిశారంటే?
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
- WhiteHat Jr: 300 మంది ఉద్యోగుల్ని తొలగించిన వైట్‌హ్యాట్