NZ Vs IND: ఏంటా స్పీడ్.. వన్డే అరంగేట్రంలోనే ఉమ్రాన్ జోరు..
టీమ్ఇండియా యువ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ తన వన్డే అరంగేట్రంలోనే సంచలనం నమోదు చేశాడు. నిలకడగా 145 కి.మీకిపైగా వేగంతో బంతులు సంధించి కివీస్ బ్యాటర్లకు సవాల్ విసిరాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ తన వన్డే అరంగేట్రంలోనే సంచలనం నమోదు చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఉమ్రాన్ నిలకడగా 145 కి.మీకిపైగా వేగంతో బంతులు సంధించి కివీస్ బ్యాటర్లకు సవాల్ విసిరాడు. తన తొలి ఐదు ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే, తన చివరి ఐదు ఓవర్లలో ఉమ్రాన్ మాలిక్ ప్రభావం చూపలేకపోయాడు.
16వ ఓవర్లో తొలి బంతికి కివీస్ ఓపెనర్ డేవాన్ కాన్వే (24)ను ఔట్ చేయడం ద్వారా వన్డేల్లో తన తొలి వికెట్‌ని ఖాతాలో వేసుకున్నాడు ఈ టీమ్ఇండియా స్పీడ్‌స్టార్. ఈ ఓవర్లో రెండో బంతినే 153.1 కి.మీ. వేగంతో విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన ఐదో ఓవర్లో డారిల్ మిచెల్ (11)ని పెవిలియన్‌కి పంపి రెండో వికెట్ నమోదు చేసుకున్నాడు. మొత్తంమ్మీద ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 66 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియాపై కివీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 307 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ 3 వికెట్లు నష్టపోయి 47.1 ఓవర్లలోనే ఛేదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!