ఆ మ్యాచ్‌ను 20 కోట్ల మంది చూశారు..

కరోనా ప్రభావంతో భద్రతా ప్రమాణాలు దృష్ట్యా ఇండియాలో జరిగాల్సిన టీట్వంటీ మెగా సంబరం ఈ నెల 19 దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ స్పోర్ట్స్‌ మెగా ఈవెంట్‌ తొలి 

Published : 23 Sep 2020 01:14 IST

 ట్విటర్‌లో బీసీసీఐ సెక్రటరీ జైషా 

న్యూదిల్లీ : కరోనా ప్రభావంతో భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఇండియాలో జరిగాల్సిన టీట్వంటీ మెగా సంబరం ఈ నెల 19 దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ స్పోర్ట్స్‌ మెగా ఈవెంట్‌ తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి, చెన్నై జట్ల మధ్య జరిగింది. ఆసక్తిరకంగా సాగిన ఈ పోరులో చెన్నై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను 20 కోట్ల మంది వీక్షించినట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు బ్రాడ్‌కాస్టింగ్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌(బీఏఆర్‌సీ) తన సర్వేలో వెల్లడించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ సోర్ట్స్‌ లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌ను ఇంతమంది చూడలేదని జైషా వెల్లడించారు. ఇదిలా ఉంటే కరోనా దృష్ట్యా దుబాయ్‌లోనూ వీక్షకులను స్టేడియంలోకి అనుమతించని విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని