Wimbledon 2022: స్టార్‌ ఆటగాడికి కరోనా పాజిటివ్‌.. టోర్నీ నుంచి ఔట్‌..

గతేడాది వింబుల్డన్‌ టోర్నీ రన్నరప్‌గా నిలిచి ఈ సారి టైటిల్‌ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్న ఇటాలియన్‌ టెన్నిస్‌ స్టార్‌ మాటియో బెరెట్టిని ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అతడికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వింబుల్డన్ 2022 నుంచి వైదొలిగాడు.

Published : 29 Jun 2022 02:43 IST

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది వింబుల్డన్‌ టోర్నీ రన్నరప్‌గా నిలిచి ఈ సారి టైటిల్‌ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్న ఇటాలియన్‌ టెన్నిస్‌ స్టార్‌ మాటియో బెరెట్టిని ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అతడికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వింబుల్డన్ 2022 నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని స్వయంగా మాటియో బెరెట్టిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ‘నాకు కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయి.గత కొన్ని రోజుల నుంచి ఐసోలేషన్‌లో ఉంటున్నా. లక్షణాలు తీవ్రంగా లేనప్పటికీ నా తోటి ఆటగాళ్లు, టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు ఉదయం మరొకసారి కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నా. దాంట్లో నాకు పాజిటివ్‌గా తేలింది. అందుకే నేను వింబుల్డన్ నుంచి వైదొలుగుతున్నా. టోర్నీ వైదొలగడం పట్ల తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నా. దానిని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. ఈ ఏడాది నా కల చెదిరింది. వచ్చే మరింత బలంగా ముందుకు వస్తా’ అని బెరెట్టిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.మాటియో బెరెట్టిని 2021 వింబుల్డన్‌ ఫైనల్‌లో సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ చేతిలో బెరెట్టిని పరాజయం పాలయ్యాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని