
మరో ‘తియ్యని విజయం’ కావాలి బాబూ!
సిరీస్‌పై కన్నేసిన కోహ్లీసేన
పరువు కోసం ఇంగ్లాండ్ పట్టుదల
పుణె: తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన కోహ్లీసేన రెండో పోరుకు సిద్ధమైంది. మరో ‘తియ్యని విజయం’ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. 2-0తో సిరీస్ కొట్టేయాలని భావిస్తోంది. ‘360 డిగ్రీల’ వీరుడు సూర్యకుమార్ అరంగేట్రం ఖాయమైంది. టీ20 సిరీస్‌ను త్రుటిలో చేజార్చుకున్న మోర్గాన్ సేన వన్డేల్లోనైనా దుమ్మురేపాలని కంకణం కట్టుకుంది. శుక్రవారం టీమ్ఇండియాను ఢీకొట్టేందుకు సై అంటోంది.
‘సూర్య’ నమస్కారం!
ఆటగాళ్ల విషయంలో టీమ్ఇండియాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒక్కో స్థానానికి ముగ్గురు నలుగురు పోటీపడుతున్నారు. అందుకే భుజం స్థానభ్రంశం చెందడంతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరమైనా బాధపడటం లేదు. టీ20ల్లో దుమ్మురేపిన సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రానికి సిద్ధమైపోయాడు. ‘360 డిగ్రీల్లో’ షాట్లు బాదేందుకు ఉవ్విళ్లూతున్నాడు. రవీంద్ర జడేజా స్థానాన్ని సుదీర్ఘ ఫార్మాట్లో అక్షర్ పటేల్ అందిపుచ్చుకోగా వన్డేల్లో కృనాల్ పాండ్య సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో పేరు తెచ్చుకున్న ప్రసిద్ధ్ కృష్ణ అరంగేట్రంలో అదుర్స్ అనిపించాడు. అందుకే జడ్డూ, షమి, బుమ్రా వస్తే టీమ్ఇండియా బలం మరింత పెరగనుంది.
ఫామ్‌లోకి గబ్బర్, రాహుల్
తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ రాణించడం జట్టుకు శుభవార్త. 2 పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నప్పటికీ అతడు వేసిన పునాదే టీమ్ఇండియాకు కీలకంగా మారింది. రెండో మ్యాచులో అతడు మరింత చెలరేగే అవకాశం ఉంది. మోచేతికి గాయం కావడంతో తొలి మ్యాచులో రోహిత్ ఫీల్డింగ్ చేయలేదు. బహుశా అతడు కోలుకుంటాడని అంటున్నారు. లేదంటే అతడి స్థానం భర్తీ చేసేందుకు శుభ్‌మన్ గిల్ సిద్ధంగా ఉన్నాడు. ఇక రాహుల్ మిడిలార్డర్లో కొనసాగనున్నాడు. అతడు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి తిరిగి ఫామ్‌లోకి రావడంతో కోహ్లీసేన సంతోషంగా ఉంది. ఒకవేళ పంత్ తుది జట్టులోకి వచ్చినా రాహులే కీపింగ్ చేస్తాడని సమాచారం.
అదే బౌలింగ్ దాడి
తొలి మ్యాచులో 9 ఓవర్లు వేసి 68 పరుగులు ఇచ్చిన కుల్దీప్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్ జట్టులోకి వస్తాడని అంచనా. తొమ్మిది వికెట్లు తీసిన భువనేశ్వర్ (2), శార్దూల్ ఠాకూర్(3), ప్రసిద్ధ్ కృష్ణ (4) ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌పై మరోసారి దాడికి దిగుతారు. ఒకవేళ మరింత వైవిధ్యం జోడించాలనుకుంటే శార్దూల్ స్థానంలో సిరాజ్ లేదా నటరాజన్‌కు అవకాశం దక్కొచ్చు. పాండ్య సోదరులు ఎప్పటిలాగే కీలకం కానున్నారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ బాధ్యతలను పంచుకోనున్నారు.
మిడిలార్డర్ దంచితేనే
సునాయాసంగా గెలిచేలా కనిపించిన ఇంగ్లాండ్‌ను మిడిలార్డర్ వైఫల్యమే దెబ్బతీసింది. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో (94; 64 బంతుల్లో), జేసన్ రాయ్ (46) మెరుపు ఆరంభాన్నిచ్చారు. నిర్భయంగా ఆడుతూ మైదానం నలుమూలలా షాట్లు బాదేశారు. 14 ఓవర్లకే 135 పరుగులు సాధించారు. అయితే మిడిలార్డర్లో బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్, మొయిన్ అలీ ఆకట్టుకోలేకపోయారు. కెప్టెన్ మోర్గాన్ సైతం గాయం కారణంగా సామర్థ్యం మేరకు ఆడలేదు. సామ్ బిల్లింగ్స్ గాయపడ్డాడు. వీరిద్దరూ రెండో వన్డేలో ఆడటంపై స్పష్టత లేదు. ఒకవేళ ఇంగ్లాండ్ భారీ లక్ష్యం నిర్దేశించాలన్నా.. ఛేదించాలన్నా వీరంతా దూకుడుగా ఆడటం ముఖ్యం. ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తమ స్పిన్‌తో టీమ్ఇండియాను ఇబ్బంది పెట్టలేకపోయారు. దాంతో ఇంగ్లిష్ జట్టు మార్క్‌వుడ్, టామ్ కరన్, సామ్ కరన్, బెన్‌స్టోక్స్ పేస్ దాడినే నమ్ముకుంటోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: భాజపా పదాధికారుల సమావేశాలను ప్రారంభించిన నడ్డా
-
Business News
Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఇవి ముందే చూసుకోండి!
-
India News
India Corona: 4 శాతానికి పైగా పాజిటివిటీ రేటు..!
-
India News
Spicejet: క్యాబిన్లో పొగలు.. స్పైస్‌జెట్ విమానం వెనక్కి
-
Sports News
Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
-
Related-stories News
Ayodhya Ram Mandir: రామమందిర నిర్మాణానికి రూ.3,400 కోట్ల విరాళాలు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- Andhra News: నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య