Published : 28/08/2020 01:08 IST

ఏబీ.. ఎలా రెచ్చిపోయాడో చూశాం కదా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికా వెటరన్‌ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్‌, డేల్‌ స్టెయిన్‌ ఇప్పటికీ అద్భుతంగా ఆడగలరని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు డైరెక్టర్‌ మైక్‌ హెసన్‌ అన్నాడు. ఈ మధ్యే దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 మ్యాచుల్లో ఏబీడీ విధ్వంసకరంగా ఆడాడని గుర్తుచేశాడు. స్టెయిన్‌ సైతం తన ఆటను మరింత మెరుగు పరుచుకుంటున్నాడని వివరించాడు. వర్చువల్‌ సమావేశంలో అతడు మీడియాతో మాట్లాడాడు.

పనిభారం పెరగడంతో ఏబీ డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే అతడు మళ్లీ సఫారీ జట్టుకు ఆడాలనుకుంటున్నాడు. కరోనాతో టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడటంతో ఇక జాతీయ జట్టుకు ఆడటం కష్టమే. ఫిట్‌నెస్‌ సమస్యలతో టెస్టులకు వీడ్కోలు పలికిన స్టెయిన్‌ పరిమిత ఓవర్ల క్రికెట్లో మళ్లీ విజృంభించాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం వారికి అంతర్జాతీయ క్రికెట్‌ బాధ్యతలు లేకపోవడంతో స్వేచ్ఛగా రాణిస్తారు అని హెసన్‌ ధీమా వ్యక్తం చేశాడు.

‘కొన్ని రోజుల క్రితమే ఏబీ డివిలియర్స్‌ దక్షిణాఫ్రికాలో మ్యాచ్‌ ఆడాడు. అంతకుముందు మ్యాచులేమీ ఆడనప్పటికీ గొప్ప ఆటగాడిగా నిరూపించుకున్నాడు. తానెంత నాణ్యమైన క్రికెటరో చూపించాడు. అతడు తాజాగా కనిపిస్తున్నాడు. కొద్దిగా శిక్షణ తీసుకుంటే చాలు రెచ్చిపోగలడు. ఏడాది కాలంగా అతడు వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. మంచి టచ్‌లో ఉన్నాడు’ అని హెసెన్‌ అన్నాడు. స్టెయిన్‌ సైతం తన ఆటను మరింత మెరుగు పర్చుకుంటున్నాడని పేర్కొన్నాడు. ‘ఆరు నెలలుగా అతడు భిన్నమైన బంతులు విసరడం చూస్తున్నాం. ఎందుకంటే అతడు వీడ్కోలుకు సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. ఐపీఎల్‌లో తన సత్తా చూపగలడు’ అని వెల్లడించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని