2021 వేలం జరగకుండా ముంబయి అడ్డుకోవాలి

2021 ఐపీఎల్‌కి ముందు ఆటగాళ్ల వేలంపాట జరగకుండా ముంబయి ఇండియన్స్‌ అడ్డుకోవాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌చోప్రా అభిప్రాయపడ్డాడు...

Published : 19 Nov 2020 18:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2021 ఐపీఎల్‌కి ముందు ఆటగాళ్ల వేలంపాట జరగకుండా ముంబయి ఇండియన్స్‌ అడ్డుకోవాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌చోప్రా అభిప్రాయపడ్డాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఈ వేలంపాట జరిగినా ఆ జట్టుకొచ్చే నష్టం లేదన్నాడు. ఎందుకంటే అదెప్పుడూ సరైన ప్రణాళికతో అందరికన్నా ముందు ఉంటుందని చెప్పాడు. ఒకవేళ వేలంపాట జరిగినా 5-6 మంది ఆటగాళ్లు అలాగే కొనసాగుతారని, అయితే.. కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పాడు. ఆ జట్టులో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నందున అందర్నీ అట్టిపెట్టుకోలేదని స్పష్టంచేశాడు. 
 ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాకుండా మరో మూడేళ్ల తర్వాత వేలం పాట జరగాలని ముంబయి ఆశించే ఆస్కారం ఉందని చెప్పాడు. మరోవైపు వేలం జరిగినా ఆ జట్టు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించాడు. ఒకవేళ జరిగితే కొందరు ఆటగాళ్లు ఇతర జట్లకు మారుతారని, దాంతో ఆయా జట్లు రోహిత్‌ టీమ్‌కు కాస్త గట్టి పోటీనిస్తాయని అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర జట్లతో ముంబయిని పోల్చడం సరికాదని, అవి చాలా దూరంలో ఉన్నాయన్నాడు. దీంతో వచ్చే ఏడాది ముంబయి నుంచి ఇంకాస్త మంచి ప్రదర్శన ఆశిస్తున్నట్లు చోప్రా పేర్కొన్నాడు. ఇక ఇటీవల యూఏఈలో ముగిసిన టీ20 మెగా లీగ్‌ 13వ సీజన్‌లో ఆ జట్టు ఐదోసారి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని