
అబ్దుల్ సమద్‌పై మాజీల ప్రశంసలు
యువరాజ్, ఇర్ఫాన్లను ఆకట్టుకున్న హిట్టర్
ఇంటర్నెట్ డెస్క్: యూఏఈలో జరుగుతున్న టీ20 మెగా లీగ్ చివరి అంకానికి చేరుకుంది. మంగళవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌తో లీగ్ ముగియనుంది. ఈ క్రమంలో క్వాలిఫైయర్-2 మ్యాచ్ సందర్భంగా ఆదివారం హైదరాబాద్, దిల్లీ జట్లు తలపడ్డాయి. దిల్లీ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యం చేధించలేక హైదరాబాద్ ఓటమి పాలైంది. అయితే వరుస వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు అబ్దుల్ సమద్ మ్యాచ్‌ను గెలిపించేలా కనిపించాడు. చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. పించ్ హిట్టర్‌గా తనకున్న పేరును నిరూపిస్తూ బౌండరీలు బాదాడు. తను ఎదుర్కొన్న 16 బంతుల్లో 33 పరుగులు చేసి భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఈ 19 ఏళ్ల జమ్మూకశ్మీర్ ఆటగాడిపై టీం ఇండియా మాజీ ఆల్‌రౌండర్లు యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించారు.
అబ్దుల్ సమద్ హైదరాబాద్ జట్టును గెలిపించాల్సింది. తన క్యారక్టర్ బలమైన ఆటతీరు పట్ల గర్వంగా ఉందని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. దీనికి యువరాజ్ సింగ్ రీట్వీట్ చేశాడు. తన నైపుణ్యంతో భరోసా కల్పించాడు. భవిష్యత్తులో సమద్ స్పెషల్ ఆటగాడిలా మారతాడని నమ్ముతున్నా యువీ అన్నాడు. మళ్లీ దీనికి ఇర్ఫాన్ రిప్లై ఇచ్చాడు. నిజమే భాయ్, సమద్‌కు టాలెంట్ ఉందన్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.