కారు ఢీకొని.. యువ క్రికెటర్‌ దుర్మరణం

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోడ్డు ప్రమాదంలో ఓ అంతర్జాతీయ క్రికెటర్‌ ప్రాణాలు కోల్పోయాడు. అఫ్ఘానిస్థాన్‌ ఓపెనర్‌ బ్యాట్స్‌మన్‌ నజీబ్‌(26) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గత శుక్రవారం నజీబ్‌ మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా రోడ్డు దాటుతున్న క్రమంలో ఓ

Updated : 06 Oct 2020 14:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోడ్డు ప్రమాదంలో ఓ అంతర్జాతీయ క్రికెటర్‌ ప్రాణాలు కోల్పోయాడు. అఫ్ఘానిస్థాన్‌ ఓపెనర్‌ బ్యాట్స్‌మన్‌ నజీబ్‌(29) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గత శుక్రవారం నజీబ్‌ మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా రోడ్డు దాటుతున్న క్రమంలో ఓ ప్యాసింజర్‌ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్రికెటర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. ‘ఓ డ్యాషింగ్‌ ఓపెనర్‌తో పాటు మంచి మనిషిని కోల్పోయామన్న వార్త మమ్మల్ని షాక్‌కు గురి చేసింది’ అని ఆ దేశ‌ క్రికెట్‌ బోర్డు ట్వీట్‌ చేసింది.
నజీబ్‌ 2014లో జింబాబ్వేపై తొలి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడాడు. 24 మ్యాచుల్లో 47.2 సగటుతో పరుగులు చేశాడు. గతేడాది ఏప్రిల్‌లో అతను ఓ డబుల్‌ సెంచరీ సాధించాడు. అఫ్గానిస్థాన్‌ తరఫున 12 టీ20లు, ఒక వన్డేకు ప్రాతినిథ్యం వహించాడు. 2017లో ఐర్లాండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో నజీబ్‌ 90 పరుగులతో ఓ మెరుపు ఇన్నింగ్స్‌ కూడా ఆడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని