ఆకాశ్‌×నీషమ్‌: లీగులో మరో వివాదం

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చాడు! అతడు చేసిన విమర్శకు ముక్కుసూటిగా సమాధానం ఇచ్చి మరోమారు మాట్లాడకుండా చేశాడు. ఇంతకీ వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం ఏంటనేగా మీ సందేహం...

Published : 04 Oct 2020 01:26 IST

ట్విటర్‌ వేదికగా పరస్పరం ఆరోపణలు

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చాడు! అతడు చేసిన విమర్శకు ముక్కుసూటిగా సమాధానం ఇచ్చి మరోమారు మాట్లాడకుండా చేశాడు. ఇంతకీ వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం ఏంటనేగా మీ సందేహం.

యూఏఈ వేదికగా జరుగుతున్న లీగులో పంజాబ్‌ నాలుగు మ్యాచులాడి మూడింట్లో ఓడిపోయింది. నిజానికి ఇందులో మూడింట్లో అది గెలవాల్సింది. జట్టు కూర్పు సరిగ్గా లేకపోవడం, డెత్‌ బౌలింగ్‌లో పస లేకపోవడంతో ఓటమి పాలవుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ జట్టు కూర్పు ఏమాత్రం బాగాలేదని ఆకాశ్‌ చోప్రా విమర్శించాడు. ముజీబుర్‌ రెహ్మాన్‌కు చోటివ్వలేకపోతున్నారని పేర్కొన్నాడు. కివీస్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ పవర్‌ప్లే, డెత్‌ బౌలింగ్‌లో రాణించలేదని, 4, 5 స్థానాల్లో భారీ షాట్లు ఆడి మ్యాచుల్ని గెలిపించలేడని పేర్కొన్నాడు. అతడు మ్యాచ్‌ విజేత కాకపోయినా ఆడించడంలో అర్థమేంటని ప్రశ్నించాడు.

ఈ విషయంపై నీషమ్‌ ట్విటర్లో స్పందించాడు. ఆకాశ్‌కు పంచ్‌ ఇవ్వాలని ప్రయత్నించాడు. అతడి గణాంకాలను ఎత్తిచూపుతూ.. ‘18.5 సగటు, 90 స్ట్రైక్‌రేట్‌తోనూ ఎక్కువ మ్యాచులు గెలిపించలేరుగా’ అంటూ ట్వీట్‌చేశాడు. నవ్వుతున్న ఏమోజీలను జత చేశాడు. ఇందుకు.. ‘నువ్వన్నది నిజమే మిత్రమా. అందుకే నన్నెవరూ ఎంచుకోవడం లేదు. మరో పని చేస్తున్నందుకు నాకు డబ్బులిస్తున్నారు. నా గణాంకాలపై తప్ప నా పరిశీలనలపై అభ్యంతరాలు లేనందుకు సంతోషం. లీగ్‌ మిగతా భాగంలో బాగా ఆడు’ అని ఆకాశ్ బదులిచ్చాడు.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు