వేధింపులు తట్టుకోలేక క్రికెటర్‌ రిటైర్మెంట్‌!

పాకిస్థాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్ కెరీర్‌కు ముగింపు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నానని ప్రకటించాడు. ప్రస్తుత పాక్‌ క్రికెట్‌ బోర్డు, జట్టు యాజమాన్యం వేధింపులు తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని నొక్కి...

Published : 18 Dec 2020 06:08 IST

కరాచీ: పాకిస్థాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్ కెరీర్‌కు ముగింపు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నానని ప్రకటించాడు. ప్రస్తుత పాక్‌ క్రికెట్‌ బోర్డు, జట్టు యాజమాన్యం వేధింపులు తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని నొక్కి చెప్పాడు. పాక్‌ తరఫున 36 టెస్టులు ఆడిన అతడు 30.47 సగటుతో 119 వికెట్లు తీశాడు. 61వన్డేల్లో 81, 50 టీ20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు.

‘మానసిక వేధింపులు తట్టుకోలేకే ఈసారి క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. వారి ఆగడాలను తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. కారణమైదేనా (మ్యాచ్‌ ఫిక్సింగ్‌) క్రికెట్‌కు దూరంగా ఉన్నా 2010-2015 మధ్య ఈ వేధింపులు భరించాను. చేసిన పనికి శిక్ష అనుభవించాను. కానీ ఇప్పుడు పీసీబీ పెట్టే వరుస వేధింపులను మాత్రం తట్టుకోలేకపోతున్నా’ అని ఆమిర్‌ అన్నాడు. కాగా పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ వసీమ్‌ ఖాన్‌.. ఆమిర్‌ వీడ్కోలుపై స్పందించాడు. ‘ఇది ఆమిర్‌ వ్యక్తిగత నిర్ణయం. దానిని పీసీబీ గౌరవిస్తుంది. ఇక ఈ వ్యవహారంపై మేమేమీ స్పందించం’ అని ఖాన్‌ అన్నాడు.

గతేడాది టెస్టు క్రికెట్‌కు ఆమిర్‌ వీడ్కోలు పలికాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కుద దృష్టి సారించాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్‌  ప్రకటిస్తున్నానని తెలిపాడు. అయితే ఎక్కువ శ్రమించడం ఇష్టంలేకే ఈ నిర్ణయం తీసుకున్నాడని విమర్శలు వచ్చాయి. అప్పట్నుంచి అంతర్జాతీయ సిరీసులకు అతడిని సరిగ్గా ఎంపిక చేయడం లేదు. విశ్రాంతి పేరుతో జట్టులోకి తీసుకోవడం లేదు. పీసీబీ, జట్టు యాజమాన్యంలో కొందరు అతడిపై వివక్ష చూపిస్తున్నారని తెలుస్తోంది.

ఇవీ చదవండి
కోహ్లీ ఒక్కడే: తొలి రోజు రక్షణాత్మకం
పుజారాను అలా అంటారా? వార్న్‌ సారీ చెప్పాల్సిందే!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని